రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13నుంచి 25 వరకు బీజేపీ అనేక కార్యక్రమాలు నిర్వహించనుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం దీనికి సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో జరిగిన కార్యశాల కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరై కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.