గుండెనొప్పి సమస్య ఉందని చెప్పిన రైతు హిర్యానాయక్ కు సంకెళ్లువేసి తీసుకెళ్తారా అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ కు పోలీసులు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై శుక్రవారం ఢిల్లీలో అరుణ స్పందించారు. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత లగచర్లకు వెళ్తానని ఎవరడ్డు వస్తారో చూస్తానని ఆమే అన్నారు.