చెరకు రైతులకు మద్దతు ధర రూ. 4వేలు, బోనస్ రూ. 1, 000 ఇవ్వాలని కృష్ణవేణి చెరకు రైతు సంఘం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిని ఉమ్మడి జిల్లా రైతులతో కలిసి ఆయన కలిశారు. వరి రైతులకు ఇస్తున్నట్లుగానే చెరకు రైతుకు బోనస్ తో పాటు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. చెరుకు రైతులు పాల్గొన్నారు.