ఈ నెల 27న వరంగల్ జిల్లా ఏత్కూరులో బీఆర్ఎస్ రజతోత్సవాన్ని విజయవంతం చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భూత్పూర్ లో మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రైతుబంధు, రుణమాఫీ, విద్యుత్ కోతలను, రూ. 4 వేల ఫించన్, దివ్యాంగులకు రూ. 6 వేలు ఇస్తామని ఎన్నికల్లో అమలు కానీ హామీలను ఇచ్చినట్లు ప్రజలకు తెలపాలని కోరారు.