మహిళలు ఆర్థికంగా నిలబడాలన్న సదుద్దేశంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం మగువ స్వశక్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హ్యాండీక్రాఫ్ట్స్ చేతి పనులపై ఆరోహీ సూయింగ్ ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్ వారి సౌజన్యంతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యాధునిక సీవింగ్ మిషన్లు, ఎంబ్రాయిడరీ మెషిన్లను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు.