ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలలో కార్తీక మాసం చివరి సోమవారం కావడం చేత ఉభయ ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. బాల బ్రహ్మేశ్వర ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి త్రిశతి పూజలో అధికంగా భక్తలు పాల్గొన్నారు. తుంగభద్ర నది పుష్కర్ ఘాటులో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు కార్తీక దీపాలు వదిలారు. దర్శనానికి క్యూలైన్లో మూడు గంటలపైనే పడుతుందని భక్తులు తెలిపారు.