నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అక్కమహాదేవి గుహలను ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చారిత్రక ప్రాధాన్యం ఉన్న అక్క మహాదేవి గుహలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.