AP: నిజమైన ప్రేమకు రంగు,భాష,దేశంతో సంబంధం లేదని నిరూపించింది ఈ ప్రేమ జంట. వివరాల్లోకి వెళ్తే.. కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన మనోజ్ కుమార్ కెనడాలో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే దేశానికి చెందిన ట్రేసి రో చే డాన్‌తో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు రేపు ఒక్కటవ్వబోతున్నారు. మలికిపురం మండలం దిండిలో తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరగనుంది.