భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జనవరి 16న హిమాని మోర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నీరజ్ భార్య హిమాని టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె సొంత ఊరు హరియాణాలోని లర్సౌలీ. ఆమె ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటోంది. నీరజ్, హిమాని మొదటగా అమెరికాలో కలుసుకున్నారట. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారని నీరజ్ బంధువు సురేంద్ర చోప్రా తెలిపారు. వీరిద్దరి రిలేషన్‌షిప్‌నకు ఇరుకుటుంబాలు ఆమోదం తెలిపాయని సురేంద్ర వెల్లడించారు.