తెలంగాణ విద్యాశాఖ మరో ప్రకటన చేసింది. షహాదత్ హజ్రత్ అలీ ఐచ్ఛిక సెలవు దినంలో మార్పు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు 21వ తేదీకి బదులు 22న ఐచ్ఛిక సెలవును ఇస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు మొదట్లో శుక్రవారం ఉండాల్సిన సెలవును శనివారానికి మార్చారు.