గతంలో ఏ సీఎం చేయనటువంటి దుర్మార్గమైన పాలనను రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. లగచర్ల బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ఓ అమ్మాయి ఛాతీ మీద కాలుపెట్టి తొక్కి ఆమె భర్తను పోలీసులు లాక్కెళ్లారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఏ పదవి లేకపోయినా పేదలను బెదిరిస్తున్నారు. అరెస్టైన వారిని పోలీసులు విడిచిపెట్టాలంటే తాము చెప్పినట్లు భూములు రాసివ్వాలని భయపెడుతున్నారు" అని కేటీఆర్ ఆరోపించారు.