జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాగ ద్వేషాలకు అతీతంగా 10 ఏళ్ల పాటు హైదారాబాద్ మహా నగరాన్ని కాపాడుకున్నామని, ఈ రేసింగ్ లాంటి ఈవెంట్స్ హైదరాబాద్ లో నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి హైదారాబాద్ లో లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించలేకపోయారు. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినదని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు.