పిడుగుపాటుకు తండ్రి, కుమార్తె దుర్మరణం
ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కామేపల్లి మండల పరిధిలోని అడవి మద్దులపల్లిలో పొలంలో పిడుగు పడి తండ్రి లింగస్వామి (50), కూతురు కావేరి (18) మృతి చెందారు. మంగళవారం భారీ వర్షం కురవడంతో పిడుగు పడి పత్తి చేనులో పని చేస్తున్న తండ్రి, కుమార్తె చనిపోవడంతో కుటుంబీకులు రోదించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.