టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని నుంచి బిపిఎల్, నవభారత్, కొత్తగూడెం ఆర్సిహెచ్పికీ టిప్పర్ల ద్వారా బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న డ్రైవర్ల వేతనాలు పెంచాలని కోరుతూ సోమవారం టిప్పర్ డ్రైవర్లు, క్లీనర్లు నిరవధిక సమ్మెకు దిగారు. డ్రైవర్లను సమ్మెకు టియుసియు నాయకులు మద్దతు తెలిపారు. గత కొన్ని నెలలుగా టిప్పర్ డ్రైవర్లకు వేతనాలు పెంచడం లేదని వెంటనే ఇప్పటి డ్రైవర్లు, క్లీనర్లకు వేతనాలు పెంచాలన్నారు.