టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధితులు సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు మాజీ ఎంపీ బాబురావు మద్దతు ప్రకటించారు