టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన పొగాకు సాయి బాబు భార్య రాజేశ్వరికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు సోమవారం టేకులపల్లి 108కి సమాచారం అందజేశారు. 108లో రామవరం ఎంసీ హెచ్‌కు తరలిస్తుండగా నొప్పులు తీవ్రం కావడంతో ఈఎంటీ రాధ పైలట్ తరుణ్ సహాయంతో వాహనంలోనే ప్రసవం చేశారు. అనంతరం రామవరం ఎంసీ హెచ్లో చేర్చారు.