ఆదివాసి హక్కుల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి కొమరంభీం అని బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ అన్నారు. మంగళవారం ఇల్లెందు పట్టణంలో కొమరంభీం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగించారన్నారు.