భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని టేకులపల్లి మండలం సులానగర్ ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం వల్లే నేడు మనం స్వేచ్ఛ స్వాతంత్య్ర సంక్షేమ ఫలాలు పొందుతున్నామన్నారు.