జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న వారికి న్యాయమైన పరిహారం చెల్లించడం జరుగుతుందని, ఇంకా ఈ విషయమై అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఇల్లందు మండలం పరిధిలో భూనిర్వాసితులతో తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. వారి నుంచి వినతులు స్వీకరించారు.