ఇల్లందు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు దసరా పండగ లోపు వేతనాలు చెల్లించాలని పండగ పూట పస్తులుంచకూడదని సిఐటియు ఆధ్వర్యంలో సింగరేణి జిఎం జాన్ ఆనంద్ ను కలిసి ఆదివారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు అబ్దుల్ నబి మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావట్లేదని ఇతర సౌకర్యాలు సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు.