ఇల్లందు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ దసరా పండగ సమీపిస్తున్న నేపథ్యంలో బిల్లులతో సంబంధం లేకుండా తక్షణమే వేతనాలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఇల్లందు రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కార్పొరేట్ లోని కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. బిల్లులతో సంబంధం లేకుండా తక్షణమే వేతనాలు చెల్లించాలన్నారు.