విద్యుత్తు నియంత్రికను ధ్వంసం చేసి అందులోని కాఫర్ను దొంగిలించిన ఘటన చోటు చేసుకుంది. ఇల్లెందు మండలం సుదిమళ్ల పరిధిలోని కోరగుట్ట వ్యవసాయభూముల్లో ఏర్పాటు చేసేందుకు ఉంచిన 16కేవీ విద్యుత్తు నియంత్రికను గురువారం దొంగలు ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడంతో పాటు రూ. 30వేల విలువైన కాఫర్ చోరీకి గురైందని రూరల్ ఏఈ రవి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.