ఇల్లందు మండల పరిధిలోని గోపాలపురం ప్రభుత్వ హైస్కూల్ కు ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతూ సోమవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతి పత్రం అందించారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో మేకలు, ఆవులు, గేదెలు పాఠశాలలో వెళ్లి మలవిసర్జన చేస్తున్నాయని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని నాయకులు ఎమ్మెల్యేను కోరారు.