తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశ్రమించేది లేదని, ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు టి. కృష్ణగౌడ్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జి. వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాలత్ వెంకట్ లాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ జ్యోతి, వివిధ హామీలు అమలు చేయనున్నారన్నారు.