జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఊకే శేఖర్ రావు ఆధ్వర్యంలో గురువారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతి పత్రం అందజేశారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవవేతనం అమలు చేయాలని కోరారు. కాగా స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.