గత కొన్ని రోజులుగా చల్లటి గాలులు వీచడం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన చలి తీవ్రత పెరగటం జరిగిందని, శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని శుక్రవారం తెలిపారు. మందం దుస్తులు ధరించటం, వేడి చేసిన నీటిని త్రాగాలని సూచించారు.