భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడుతాయని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఏపీవో వీరభద్ర స్వామితో కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతగా, వేగవంతంగా చేపట్టాలని సూచించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు.