మణుగూరులో సింగరేణి సంస్థ మనుగడకై సింగరేణి గనులను విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీ బలరాం నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఐఎఫ్టీయూ కార్యదర్శి నాజర్ పాష మాట్లాడుతూ మణుగూరు బొగ్గు గనులకు ఘనమైన చరిత్ర ఉందని ఆయన అన్నారు. గనుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందే లాగా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.