జాతీయ మహిళా సమైఖ్య 22వ మహాసభ సందర్భంగా శనివారం హైదరాబాదులో మహిళా చట్టాలపై కొత్తగూడెంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా సమైక్య జిల్లా కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఉపాధ్యక్షురాలు కరిశ రత్నకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో రిజర్వేషన్ కల్పించాలని అన్నారు.