డిఎస్సీ ద్వారా ఎంపికైన స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల ధ్రువపత్రాలను కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పరిశీలించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు 1: 3 నిష్పత్తిలో అభ్యర్థులకు సమాచారం అందించారు. హాజరైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి రెండు జిరాక్స్ కాపీలు తీసుకున్నారని డీఈవో తెలిపారు.