యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శుక్రవారం తెలిపారు. ఉపాధి కల్పన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్, ఐటీఐల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.