పాల్వంచ పట్టణ పరిధిలోని గాంధీనగర్ 5వ వార్డ్ లో పెద్ద పాల చెట్టు కింద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నెల రోజులు పాటు జరిగిన పూజా కార్యక్రమంలో బాగంగా శనివారం అన్నదానం కార్యక్రమంతో ముగిశాయి. గత నెల 17న ప్రారంభమైన ముత్యాలమ్మ ఉత్సవాలు నెలరోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు సేకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.