నేడు, రేపు ఓటర్ నమోదు, సవరణల కొరకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని దుమ్ముగూడెం తహశీల్దార్ అశోక్ కుమార్ శనివారం తెలిపారు. బూత్ స్థాయి అధికారులు నేడు, రేపు పోలింగు కేంద్రాల్లో ఫారం 6, 7, 8 దరఖాస్తులను తీసుకొని పరిశీలిస్తారని అన్నారు. కావున ప్రజలు, ఓటర్లు తమ స్థానిక పోలింగ్ కేంద్రంలో సంప్రదించాలని కోరారు.