దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో జరిగిన సీపీఎం శాఖ మహాసభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఆదివారం పాల్గొని మాట్లాడారు. తూరుబాక పరిధిలో ప్రతిరోజు 4 సార్లు కరెంటు పోతుందని, వెంటనే లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తూరుబాక గ్రామంలో కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలని చెప్పారు. అన్నీ రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని అన్నారు.