కేంద్ర వార్షిక పద్దు గందరగోళంగా, కార్పొరేట్ పెత్తందారులకు అనుకూలంగా ఉందని దాన్ని వెంటనే సవరించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం చర్ల మండల కేంద్రంలో జరిగిన వామపక్షాల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సామాన్యులు, రైతులు, కార్మికులు, కర్షకులకు వ్యతిరేకంగా బడ్జెట్ ను రూపొందించారని మండిపడ్డారు.