భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భద్రాచలం మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కోకన్వీనర్ దాసరి శేఖర్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన ఖమ్మంలో జరగబోయే మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాల, మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని, రాజకీయ లబ్ధి కోసమే మాలలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు.