జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలలో 18 ఏళ్లు దాటిన మహిళలకు చీరలు అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం అన్నారు. మండలాల వారీగా నియమించబడ్డ ప్రత్యేక అధికారులు ఈ చీరలను సరఫరా చేయాలని అన్నారు. స్వయం శక్తి గ్రూప్ మహిళలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఐకెపి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ల సహకారంతో గిరిజన లబ్ధిదారులను గుర్తించి చీరల పంపిణీ సక్రమంగా జరగాలని అన్నారు.