భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏజెన్సీ ప్రాంతంలో రోటరీ క్లబ్ ద్వారా ఎంతో మంది చేయూతని పొందుతున్నారని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ హైదరాబాద్ వారి సౌజన్యంతో భద్రాచలం పట్టణంలోని 30 మంది మహిళలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పంపిణి చేసి ప్రసంగించారు.