భద్రాచలం నుంచి కూకట్పల్లి, హైదరాబాద్ కి వెళ్లే ఆర్టీసీ సర్వీసులను రద్దు చేయడంతో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శనివారం డిపో మేనేజర్ కు సీపీఎం నాయకులు వినతి పత్రం సమర్పించారు. వెంటనే ఆ రెండు సర్వీసులను పునరుద్ధరించాలని పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి కోరారు. గత 20 ఏళ్ల నుంచి నడుస్తున్న సర్వీసులను అర్ధాంతంగా నిలిపివేయడం సమంజసం కాదన్నారు.