భద్రాచలంలో ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పీఓ రాహుల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో కుటుంబంలోని వ్యక్తులందరినీ నమోదు చేయాలని ఎన్యుమరేటర్లను ఆదేశించారు. గొల్లబజారులో నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొని పలు అంశాలు పరిశీలించారు. పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.