భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెంచీలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని విద్యార్థులకు బెంచీలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా అండగా ఉంటానని ఆయన అన్నారు.