భద్రాచలం మన్యంలోని గిరిజనులు తమ జీవనోపాధిని పెంపొందించుకునేందుకు దర్బారును ఉపయోగించుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. సోమవారం ఐటీడీఏలో దర్బారు నిర్వహించి వినతులు స్వీకరించారు. వీటిని పరిశీలించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపారు. ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ల ఆధారంగా ప్రకటిస్తారని, దీన్ని గుర్తించి ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేయవద్దని వెల్లడించారు.