భద్రాచలంలోని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఎల్జీ వివిబిఎన్ ఆచారి అధ్యక్షతన పెన్షనర్ల ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఎస్బిఐ చీఫ్ మేనేజర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పెన్షనర్ల సమస్యలను ప్రస్తావించమని తెలుపగా భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే తేదీలలో ప్రత్యేక కౌంటర్లను రెండింటిని ప్రారంభించాలన్నారు.