అశ్వారావుపేట ఆర్సీఎం చర్చి ఫాదర్ టోనీ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం నిర్వహించారు. క్రైస్తవులు పాల్గొని ఈత కొమ్మలతో హోసన్నా జయం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ ఏసుక్రీస్తు దివ్యమైన మరణానికి ఘనమైన ప్రవేశమే ఈ హోసన్న పండుగ అని అన్నారు. ప్రజలందరూ ఈ పవిత్ర వారంలో పరిశుద్ధంగా జీవించాలని సూచించారు. ఈ వేడుకల్లో మండల క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.