చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామంలో శనివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవతో ప్రభుత్వం నూతనంగా అంగన్వాడీ భవనం మంజూరు చేయగా నిర్మాణ పనులను భూమిపూజ చేసి ప్రారంభించి త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.