దసరా సెలవులకు స్వగ్రామాలకు, బంధువుల గ్రామాలకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు పాటించాలని అశ్వారావుపేట ఎస్సై యయాతి రాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇరుగుపొరుగు వారికి ఊరికి వెళ్తున్నట్లు సమాచారం ఇవ్వాలని, విలువైన నగలు, ఆభరణాలు వెంట తీసుకుని వెళ్లాలని, బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకుని వెళ్లాలని ఆయన అన్నారు.