అశ్వారావుపేట మండలం తిరుమల కుంట కాలనీకి చెందిన 100 కుటుంబాల గిరిజనులు 20 ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతంకు వెళ్లి ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. మెరక ప్రాంతం ఎంతో హాయిగా ఉంటుందనుకున్న ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి వచ్చి పడింది. అదే ఊరు ఊటరూపంలో గుట్టలపై నుంచి వస్తున్న ఊటతో కాలనీలోని మడివి బుల్లెమ్మ ఇల్లు కూలిపోయింది. శనివారం ప్రభుత్వ అధికారులు మాగోడు పట్టించుకోవాలని కోరుతున్నారు.