ములకలపల్లి మండలం రింగిరెడ్డిపల్లికి చెందిన బైటా జోగులుతోపాటు మరో తొమ్మిది మంది రైతులకు ఒక విద్యుత్తు లైనుతోపాటు నియంత్రికను అందజేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రాధాకృష్ణ అక్రమంగా విద్యుత్ నియంత్రిక నుంచి విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్నాడు. ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడు పడుతోందని జోగులు ప్రశ్నించడంతో రాధాకృష్ణ అతడిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.