కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ టర్నింగ్ వద్ద ఈనెల 13న జరిగిన గొడవలో కాగజ్నగర్ టౌన్ పోలీసులు ఇదివరకే ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా శనివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టౌన్ సీఐ శంకరయ్య వెల్లడించారు. తదుపరి విచారణ కొనసాగుతుందని, గొడవలకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, త్వరలో బాధ్యులైన ప్రతీఒక్కరిని అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు.