ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షులు నైనాల గోవర్ధన్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం సిర్పూర్ మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈ వార్షిక బడ్జెట్లో కేవలం రూ. 250కోట్లు ప్రాజెక్టుకు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని, వెంటనే డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు.